మందుబాబుల కోసం ‘చంద్రబాబు పోరాటం’

Update: 2020-02-20 06:26 GMT

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ‘మందు బాబుల’ కోసం పోరాటం చేస్తున్నారా?. రాష్ట్రంలో సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారా?. రేట్లు పెంచి పేదల పొట్టగొడుతున్నారని..ఏదో కష్టాలు మర్చిపోవటానికి మందు తాగితే వారి జేబులకు చిల్లు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అసలు రాష్ట్రంలో సమస్యలు అన్నీ వదిలేసి చంద్రబాబు ‘మందు’పై ఫోకస్ చేయటం వెనక మతలబు ఏమిటి?. అసలు ప్రజలకు చంద్రబాబు లేవనెత్తిన ఈ డిమాండ్ ద్వారా ఎలాంటి సంకేతాలు పంపదల్చుకున్నారు. నిజంగా ఏపీలో ‘బ్రాండ్ల’ను కుదించటం వల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏంటి?. రాష్ట్రంలో ఇక అసలు సమస్యలే లేవా?. బహిరంగ సభల్లో ఇది చంద్రబాబు లేవనెత్తాల్సిన సమస్యేనా ఇది?. టీడీపీ నాయకులు సైతం చంద్రబాబు మాటలను చూసి విస్తుపోతున్నారు.

ప్రజలకు ఏదో నిత్యావసరాలు దొరకటం లేదన్నట్లు పదే పదే చంద్రబాబు మందు బ్రాండ్ల అందుబాటు గురించి..రేట్ల గురించి ప్రస్తావించటం లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందని ఆ పార్టీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ఆయన ఏపీలోని మందుబాబుల కోసం పోరాటం చేస్తున్నట్లుగా ఉందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అధికార వైసీపీ కూడా చంద్రబాబు వ్యాఖ్యల నుంచి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినా సరే చంద్రబాబు మాత్రం మందు బాబుల కోసం తన పోరాటాన్ని ఏ మాత్రం ఆపటం లేదు.

 

Similar News