విజయ్ దేవరకొండ..పూరీ సినిమా స్టార్ట్

Update: 2020-01-20 05:27 GMT

‘ఫైటర్’ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా..విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా ఇది. ఛార్మి కౌర్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ థాయ్‌లాండ్‌లో మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ లో శిక్షణ తీసుకున్నాడు. సోమవారం నాడు ఈ సినిమా షూటింగ్‌ సోమవారం ముంబయ్ లో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో విజయ్‌, పూరి జగన్నాథ్‌, చార్మి పాల్గొన్నారు.

పూరి కనెక్ట్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మిలతో కలిసి కరణ్ జొహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తొలుత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ పేరు ప్రచారం జరిగినా..ఇప్పుడు మాత్రం అనన్య పాండే పేరు తెరపైకి వచ్చింది.

 

 

 

Similar News