బాలుడిపై సామూహిక అత్యాచారం

Update: 2020-01-30 05:41 GMT

కర్నూలులో దారుణం జరిగింది. ఓ బాలుడిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలం రేపింది. పధ్నాలుగు సంవత్సరాల యువకుడిపై నలుగురు యువకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. కర్నూలు జిల్లా అవుకు పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత బాలుడిని భోజనం పేరుతో తమ వెంట తీసుకెళ్ళిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన తాజాగా బయటపడింది. అవుకు పట్టణానికి చెందిన ఒక బాలుడు (14) ఒంటరిగా ఆడుకుంటుండగా నలుగురు యువకులు మాయ మాటలతో ఓ కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. అక్కడే సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

బాలుడికి రక్తస్రావమై అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. తమ అబ్బాయి లైంగిక దాడికి గురయ్యాడన్న విషయం తెలుసుకున్న బాలుని తల్లిదండ్రులు అవుకు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడిని చిత్రహింసలకు గురి చేసిన వారిలో బుల్లెట్‌ రాజు, ప్రేమ్‌ కుమార్‌, రాజుతో పాటు మరొకరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై సెక్షన్‌ 377 కింద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వీరిపై గతంలోనే పలు రౌడీషీట్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News