పవన్ కళ్యాణ్ ‘సినీ దూకుడు’

Update: 2020-01-30 06:38 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి తర్వాత కూడా రాజకీయాల్లో తన దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. వాస్తవానికి ఎన్నికలకు ముందు కంటే ఎన్నికల తర్వాతే ఆయన రాజకీయాల్లో స్పీడ్ పెంచినట్లు కన్పిస్తుంది. ఇప్పుడు ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమాల్లోనూ దూకుడు పెంచారు. ఇప్పటికే ‘పింక్’ రీమేక్ సినిమాల్లో నటిస్తూనే..మరో వైపు ఆదివారం నాడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లో ఈ షూటింగ్ ముహుర్తపు షాట్ చిత్రీకరించినట్లు సమాచారం.

దీంతో పవన్ రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లు అయింది. తాజా వార్త ఏంటంటే మూడవ సినిమా కూడా పవన్ ఓకే చేసినట్లు ప్రచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడకపోయినా పిల్మ్ సర్కిల్స్ లో ఈ వార్తలు గుప్పుమంటున్నాయి. అజ్ణాతవాసి తర్వాత పవన్ కొత్త సినిమా ఏదీ చేయలేదు. ఇఫ్పుడు వరస పెట్టి సినిమాలకు ఓకే చేస్తున్నారు.

 

 

Similar News