రాజధాని మార్పుపై జగన్ కు కన్నా లేఖ

Update: 2020-01-30 16:20 GMT

ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజధాని మార్పు అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గురువారం నాడు లేఖ రాశారు. అమరావతి నుంచి పరిపాలనా రాజధానిని వైజాగ్ కు మార్చటం సరైన చర్య కాదన్నారు. బిజెపి అభివృద్ధి వికేంద్రీకరణకు ఓకే కానీ..పరిపాలనా వికేంద్రీకరణకుకాదని స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల రాష్ట్రంలో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల ప్రజల కూడా భారం పడుతుందని అన్నారు. వినాశకమైన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు.

అప్పుల్లో ఉన్న ఏపీపై మరింత భారం మోపుతున్నారని చెప్పారు. జీఎన్‌‌రావు కమిటీ నివేదికలో అంశాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. విశాఖలో తుఫాను, భద్రత ముప్పు, భూముల లభ్యత లేకపోవడాన్ని జీఎన్‌రావు కమిటీ చెప్పిందని..వాటిని ఎందుకు పరిగణించడం లేదని కన్నా ప్రశ్నించారు. రాజధాని మార్పు నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నట్లుందన్నారు. ప్రభుత్వం మొండిగా, అప్రజాస్వామికంగా ఉండకూడదని కన్నా సూచించారు.

Similar News