మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర

Update: 2020-01-27 04:48 GMT

ఊహించిందే జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి రద్దుకు ఏపీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇక అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపటమే తరువాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రాత ముగిసిపోతుంది. సరిగ్గా 2007లో ఏర్పాటు అయిన మండలిని జగన్మోహన్ రెడ్డి సర్కారు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మండలి రద్దుకు ఆమోదముద్ర పడింది. ఇక బాల్ కేంద్రం కోర్టులోకి వెళ్లనుంది. పార్లమెంట్ లో ఈ ప్రతిపాదనకు ఆమోదం పొంది..రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మండలి రద్దు అమల్లోకి వస్తుంది. అప్పటివరకూ మండలి కొనసాగుతుంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు మండలి అడ్డు చెప్పటం సర్కారును షాక్ కు గురిచేసింది.

తాము అనుకున్న పనులు అన్నింటిని మండలిలో మెజారిటీ ఉందని..ప్రతిపక్ష టీడీపీ అడ్డుపడుతుండటంతో జగన్ ఈ నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు. ప్రజలకు మంచి చేయాలనే బిల్లులకు ఇలా మండలిలో అడ్డుపడటం ఏమిటని..అసలు మండలి అవసరం ఉందా? అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు అనుగుణంగా కేబినెట్ లో మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారు.

 

 

 

Similar News