ఏపీ రాజధాని షటిల్ సర్వీసా?

Update: 2019-12-18 06:44 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. ఈ అంశంపై ఆయన మీడియతో మాట్లాడారు. ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు కానీ..దక్షిణాఫ్రికా జగన్ కు ఆదర్శమా? అని ప్రశ్నించారు. అక్కడ కనీసం తిండి కూడా దొరకటంలేదన్నారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా రాజధాని ఒక్కటే ఉంటుందని అన్నారు. కానీ ఆంధ్రుల రాజధాని షటిల్ సర్వీసా? అని ప్రశ్నించారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు వద్దని నెల్సన్ మండేలా చెప్పారు. బ్రిటిష్ వాళ్ల వల్లే సౌతాఫ్రికాలో మూడు రాజధానులు వచ్చాయి. హైదరాబాద్‌లోని ఆస్తుల కోసమే ఏపీ అభివృద్ధి చెందకూడదని జగన్ కోరుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి అతికష్టంగా వచ్చిన ఉద్యోగులు..విశాఖలో మరింత ఇబ్బంది పడతారు. విశాఖలోనూ మళ్లీ భవనాలు నిర్మించుకోవాల్సిందే. రాజధానిగా ఉన్నా..లేకపోయినా విశాఖకు పెట్టుబడులు వస్తాయి. రాజధానిపై కమిటీ నివేదిక రాకుండానే ప్రకటన ఎలా చేస్తారు? .తుగ్లక్ పాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు .

ప్రాంతాల మధ్య జగన్ చిచ్చుపెట్టారు. కక్షపూరితంగా జగన్ నిర్ణయాలు. జగన్ నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రావు. పెట్టుబడులు రాకుంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తే ఏం లాభం?.ఆస్థానా నగరాన్ని పరిశీలించాలని మోదీ సూచన చేశారు . మేం సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుంటే.. జగన్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటున్నారు.ఎవరి మైండ్ సెట్ ఎలా ఉందో తెలుస్తోంది. అమరావతి కాకుంటే ఏది సరైందో చెప్పండి..కానీ 3 రాజధానులు ఎందుకు? .అమరావతిలో చట్టసభలు మాత్రమే ఉంటే అసెంబ్లీ తర్వాత ఎడారే .రాజధాని మార్పుపై భూములు ఇచ్చిన రైతుల్లో ఆందోళన . ఇప్పటికే లిమిట్ దాటిపోయారు..రాష్ట్రానికి అప్పులు ఇచ్చేవాళ్లు లేరు .పథకాల అమలు వాయిదా వేస్తున్నారు..రాజధానులు ఎలా నిర్మిస్తారు? అని యనమల ప్రశ్నించారు.

 

 

 

Similar News