తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు హామీ ఇచ్చినట్లు వారి పదవి విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైలుపై కెసీఆర్ సంతకం చేశారు. ఇక ఆదేశాలు వెలువడటమే తరువాయి. ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుంది.
గతంలో ఎన్నడూ జరగని రీతిలో సాగిన ఆర్టీసీ సమ్మె విరమణ తర్వాత కార్మికులతో సమావేశం అయిన సీఎం కెసీఆర్ వారికి పలు వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పదవి విరమణ వయస్సు పెంపు వల్ల ఆర్టీసీ డ్రైవర్లు సమస్యలు ఎదుర్కొంటారనే విమర్శలు ఉన్నా..సర్కారు మాత్రం ముందు ప్రకటించినట్లు నిర్ణయం తీసుకుంది.