మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. జనవరి 11న ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రతి సోమవారం ఒక్కో పాటను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ చెప్పినట్లుగానే ఈ సోమవారం నాడు ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసింది. ‘మైండ్ బ్లాక్’ పేరుతో సాగే ఈ పాటను రిలీజ్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా రష్మిక మందన నటిస్తున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతికి అల్లు అర్జున్, మహేష్ బాబు ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టనున్నాయి.
పాటల విషయానికి వస్తే అల్లు అర్జున్ హీరోగా నటించిన అల..వైకుంఠపురములో సినిమాకు సంబంధించి విడుదలైన సామజవరగమన, రాములో రాములా పాటలు దుమ్మురేపాయి. మూడవ పాట ఓ మైగాడ్ డాడీ మాత్రం ఓ మోస్తరుగా ఉంది. అయితే మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ ‘మైండ్ బ్లాక్’ ప్రేక్షకుల్లో జోష్ తీసుకురావటంలో విఫలమైందనే చెప్పాలి. పాటల పరంగా చూస్తే ఇఫ్పుడు అల్లు అర్జున్ సినిమా జోష్ లో ఉన్నట్లు లెక్క.
https://www.youtube.com/watch?v=9ub504V9Hg8&feature=youtu.be