ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇరవై రోజుల క్రితమే పెళ్లి అయింది. అది కూడా ప్రేమించిన వ్యక్తినే పెళ్ళి చూసుకుంది. కానీ అంతలోనే శవమై కన్పించింది. ఈ వ్యవహారం హైదరాబాద్ లోని సనత్ నగర్ పరిధిలో కలకలం రేపింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అన్నపూర్ణ.. గంగాధర్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆమె మంగళవారం రాత్రి ఇంట్లో చనిపోయి ఉన్నట్లు గుర్తించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి విచారణ ప్రారంభించారు. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తెనే భర్తే హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా పోలీస్ స్టేషన్ ఎదురు ఆందోళనకు దిగారు.