పార్టీ నిర్మాణంపై జనసేన ఫోకస్

Update: 2019-11-06 13:51 GMT

ఏపీలో రాజకీయంగా జనసేన దూకుడు పెంచింది. తాజాగా విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్ విజయవంతం కావటంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉండటంతో కొంత అయినా ఆ స్పేస్ ను ఆక్రమించుకునేందుకు ఆ పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.)లో కొత్తగా మరో నలుగురు నాయకులకు అవకాశం కల్పిస్తూ పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీకి నాదెండ్ల మనోహర్ ఛైర్మన్ గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కమిటీలో 12 మంది సభ్యులు ఉన్నారు.

కమిటీని విస్తరిస్తూ కొత్తవారికి స్థానం కల్పించడంతో ఆ సంఖ్య 16కి చేరింది. పీఏసీలో చోటుదక్కించుకున్న వారిలో పంతం నానాజీ (కాకినాడ), చిలకం మధుసూదన్ రెడ్డి (ధర్మవరం), బోనబోయిన శ్రీనివాస యాదవ్ (గుంటూరు), పితాని బాలకృష్ణ (ముమ్మిడివరం)లు ఉన్నారు. అదే సమయంలో కొత్తగా ముగ్గురు అధికార ప్రతినిధులను కూడా నియమించారు. సుజాత పండా (శ్రీకాకుళం), సుందరపు విజయకుమార్ (విశాఖపట్నం), పరుచూరి భాస్కరరావు (విశాఖపట్నం)లను అధికార ప్రతినిధులుగా నియమించారు. లాంగ్ మార్చ్ ను విజయవంతం చేయటానికి కృషి చేసిన నేతలు అందరికీ పవన్ కళ్యాణ్ కృతజ్ణతలు తెలిపారు.

 

Similar News