సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు జగన్

Update: 2019-11-01 08:31 GMT

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జగన్ తరపున లాయర్లు పిటీషన్ దాఖలు చేశారు. శుక్రవారం నాడే ఇదే అంశంపై సీబీఐ కోర్టు మినహాయింపు ఇవ్వటం సాధ్యం కాదని..ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని పేర్కొంది. జగన్ పిటీషన్ పై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో సీబీఐ కోర్టు విచారణ సంస్థ వాదన వైపే మొగ్గి జగన్ కోరిన మినహాయింపును తోసిపుచ్చింది.

 

Similar News