ఏపీ అసెంబ్లీ డిసెంబర్ 9 నుంచి

Update: 2019-11-22 08:04 GMT

ఏపీ అసెంబ్లీ ఈ సారి మరింత హాట్ హాట్ గా ఉండటం ఖాయంగా కన్పిస్తోంది. అసెంబ్లీ వెలుపలే ఇఫ్పటికే రాజకీయంగా విమర్శలు హద్దులు దాటి పోతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుకుంటున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు అంటే ఈ విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. పలు అంశాలు ఈ సారి అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇసుక కొరతతోపాటు అమరావతి, స్కూళ్ళలో ఇంగ్లీష్ మాధ్యమం మాత్రమే చెప్పాలనే సర్కారు నిర్ణయం, రైతు భరోసాలో కోతలు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం కన్పిస్తోంది. డిసెంబర్ 9న ప్రారంభం అయ్యే సమావేశాలు సుమారు పది రోజుల పాటు సాగే అవకాశం ఉందని అంచనా. అధికార పార్టీ కూడా ప్రతిపక్షంపై పెద్ద ఎత్తున ఎటాక్ కు రెడీ అవుతోంది.

Similar News