వల్లభనేని వంశీ పార్టీ మారతారా?!

Update: 2019-10-25 06:23 GMT

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తప్పదా?. పరిణామాలు చూస్తుంటే ఆ దిశగానే సాగుతున్నట్లు కన్పిస్తున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభేనేని వంశీ బిజెపిలో చేరతారా?. ఆయన గుంటూరులో కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో భేటీ కావటంతో ఈ చర్చ మరింత పెరిగింది. ఓ వైపు టీడీపీ ఇసుక సరఫరాలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ధర్నాలు చేస్తుంటే వంశీ మాత్రం అదేమి పట్టించుకోకుండ సుజనా చౌదరితో భేటీ కావటం ఈ అనుమానాలను మరింత పెంచింది. అయితే వంశీ బిజెపిలో చేరాలంటే ఎమ్మెల్యే పదవిని వదులుకోవాల్సి వస్తుంది.

ఎవరు పార్టీ మారిన వేటు తప్పదని సాక్ష్యాత్తూ జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ప్రకటించటంతో ఇది అంత తేలిగ్గా జరిగే పరిణామం కాదంటున్నారు. మరి ఏమి జరగబోతోంది. వంశీ ఒక్కరేనా..వంశీతోపాటు మరెవరైనా కూడా ఉంటారా అన్న కోణంలోనూ పార్టీలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత కొంత కాలంగా టీడీపీకి చెందిన కీలక నేతలు బిజెపి వైపు వెళుతున్నారు. మరి వంశీ వ్యక్తిగత పనుల మీద సుజనా చౌదరిని కలిశారా? లేక పార్టీ మార్పు అంశంపై చర్చించేందుకు వెళ్ళారా? అన్నది ఆయన స్పందిస్తే కానీ తెలియదు.

 

 

Similar News