అక్టోబర్ 19న తెలంగాణ బంద్

Update: 2019-10-12 11:06 GMT

ఆర్టీసి సమ్మె వ్యవహారం తీవ్ర రూపం దాల్చుతోంది. సర్కారు ఏ మాత్రం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోవటంతో వారం రోజుల కార్యాచరణను ప్రకటించింది ఆర్టీసీ జెఏసీ. ఈ జెఏసీ నిర్ణయానికి పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తిరిగి అంతకు ముందు ఉన్న పరిస్థితి ఏర్పడనుంది. వారం రోజుల కార్యాచరణ తర్వాత చివరగా అక్టోబర్ 19న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా వంటావార్పు, 14న అన్ని డిపోల దగ్గర వంటా వార్పు, బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, మానవహారాలు తలపెట్టారు.

16న ఐక్య కార్యాచరణ సమితికి మద్దతుగా విద్యార్ధుల ర్యాలీలు, 17న ధూంధాం కార్యక్రమాలు, 18న ద్విచక్ర ర్యాలీలు చేపట్టనున్నారు. చివరగా 19న తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు అధికార టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించనున్నాయి. ఇఫ్పటికే అఖిలపక్షంలో అన్ని పార్టీలు సూత్రప్రాయంగా దీనికి అంగీకరించాయి. తెలంగాణ బంద్ నిర్ణయంతో ఆర్టీసి వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లు అయింది.

 

 

 

 

 

Similar News