న్యూయార్క్ నుంచి సిడ్నీ. ఏకబిగిన ప్రయాణం. ప్రయాణ సమయం 19 గంటలు. ఆ విమానంలో 50 మంది ప్రయాణికులు. సిబ్బంది. ఇప్పుడిది ఓ ప్రపంచ రికార్డు. ఎందుకంటే ఇప్పటివరకూ ప్రపంచంలో ఏకబిగిన 19 గంటల విమాన ప్రయాణం అన్నది లేదు కాబట్టి. ఈ రికార్డ్ ను క్వాంటాస్ ఎయిర్ లైన్స్ సాధించింది. క్వాంటాస్ కు చెందిన విమానం క్యూఎఫ్789 ఆదివారం ఉదయం 7.43 నిమిషాలకు సిడ్నీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానంలో ప్రయాణికులను తీసుకెళ్ళటం వెనక కూడా ఓ ఉద్దేశం ఉంది. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో వారి శారీరక, మానసిన స్థైర్యం ఎలా ఉంటుంది అన్నది కూడా పరిశీలించారు. పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతించటంతోపాటు..లగేజ్ విషయంలో కూడా చాలా పరిమితులు పెట్టారు. ఈ విమానంలో 101 టన్నుల జెట్ ఫ్యూయల్ తో నింపారు.
విమాన బరువులో ఈ ఇంథనం బరువు సగం ఉంటుంది. ఈ విమానం మొత్తం 16,200 కిలోమీటర్ల ప్రయాణం సాగించింది. సుదూర ప్రాంతాల విమాన సర్వీసుల్లో పలు కొత్త సవాళ్ళు ఉంటాయని..అయినా సరే సాంకేతిక పరిజ్ణానం మాత్రం సుదూర ప్రయాణాలనుక డా అనుమతిస్తోందని చెబుతున్నారు. భిన్నమైన టైమ్‌జోన్స్ ను దాటి సుదీర్ఘ ప్రయాణం చేసే వారు, విమాన సిబ్బందిపై జెట్‌ల్యాగ్ ప్రభావానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్వాంటాస్ రెండు ఆస్ర్టేలియన్ యూనివర్సిటీలతో అవగాహన కుదుర్చుకుంది. క్వాంటాస్ గత ఏడాది ఆస్ర్టేలియాలోని పెర్త్ నుంచి లండన్‌కు తొలి డైరెక్ట్ ఫ్లైట్‌ను ప్రవేశపెట్టగా 17 గంటల ప్రయాణంతో కూడిన ఈ విమానమే ప్రపంచంలోనే లాంగెస్ట్ పాసింజర్ విమానంగా నమోదైంది.