ఏపీ కొత్త సీజెగా మహేశ్వరి ప్రమాణస్వీకారం

Update: 2019-10-07 06:05 GMT

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జీకే మహేశ్వరి కుటుంబసభ్యులు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, హైకోర్టు అడ్మిన్‌ రిజిస్ట్రార్‌ పురుషోత్తం, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. జస్టిస్‌ మహేశ్వరి 1961 జూన్‌ 29న జన్మించారు. 1985 నవంబర్‌ 22న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ఆయన హైకోర్టు సీజేగా 2023 జూన్‌ 28న పదవీ విరమణ చేస్తారు.

 

Similar News