గ్రామాల అభివృద్ధికి 339 కోట్లు

Update: 2019-10-10 06:28 GMT

తెలంగాణలో గ్రామాల అభివృద్ధి కోసం 339 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. ఆయన గురువారం నాడు ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లతో సమావేశం అయ్యారు. గ్రామాల్లో చేపట్టిన 30 రోజుల కార్యాచరణ గ్రామాల్లో విజయవంతం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కారం అయ్యాయని అన్నారు.

పవర్ వీక్ ను విద్యుత్ సిబ్బంది విజయవంతం గా నిర్వహించిందని తెలిపారు. అన్ని శాఖల్లో కంటే విద్యుత్ శాఖ మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. మొదటి విడత, మంత్రులు, కలెక్టర్లు, సర్పంచ్ లు, అధికారులకు అభినందనలు తెలిపారు కెసీఆర్. ఇదే స్ఫూర్తిని భవిష్యత్ లో కొనసాగించాలని ఆయన అధికారులకు సూచించారు.

 

 

Similar News