తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఫాంహౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ ఎకె 47 గన్ తో కాల్చుకుని చనిపోయాడు. వెంకటేశ్వర్లది నల్లగొండ జిల్లా వాలిగొండ అని సమాచారం. ఆత్మహత్య ఘటనపై సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ స్పందించారు. మద్యం మత్తు లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
వెంకటేశ్వర్లు గతకొంత కాలం గా సరిగా విధుల కు హాజరు కావటంలేదని.. భార్య విజ్ఞప్తి తో తిరిగి విధుల్లో చేర్పుకున్నట్లు వెల్లడించారు. ఫాంహౌస్ లో ఆయన హెడ్ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఆయన మృతదేహన్ని గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. అయితే కొంత మంది అధికారుల వేధింపులే దీనికి కారణం అనే అభిప్రాయం కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.