మాజీ భార్యను రేప్ చేసిన ప్రొఫెసర్

Update: 2019-09-26 07:01 GMT

ఆయనో ప్రొఫెసర్. భార్యకు విడాకులు ఇఛ్చాడు. తర్వాత ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. కానీ మధ్యలో పిల్లలను చూసేందుకు అని చెప్పి తరచూ విడాకులు ఇచ్చిన భార్య ఇంటికి రావటం మొదలుపెట్టాడు. ఓ రోజు ఎవరూ లేని సమయంలో మాజీ భార్యను బెదిరించి రేప్ చేశాడు. ఇది అలీగడ్ కు చెందిన ఓ ప్రొఫెసర్ చేసిన పని. విద్యార్ధులను తన పాఠాలతో సరైన మార్గంలో పెట్టాల్సిన ఆయనే వక్రమార్గం పెట్టిన ఘటన ఇది. ఈ ఫ్రొఫెసర్ కొద్ది రోజుల క్రితం భార్యకు వాట్సాప్‌ ద్వారా ట్రిపుల్‌ తలాక్‌ చెప్పారు. సదరు ప్రబుద్ధుడు.. అనంతరం విడిగా భార్యపై అత్యాచారం జరిపాడు. 58 ఏళ్ల నిందితుడిపై పోలీసులు లైంగిక దాడి (376), క్రిమినల్‌ బెదిరింపులు (506) తదితర ఐపీసీ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.

యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ అయిన నిందితుడు ఏడాదిన్నర కిందట భార్యకు సత్వర త్రిపుల్‌ తలాఖ్‌ ద్వారా విడాకులు ఇచ్చాడు. 2017లో వాట్సాప్‌ ద్వారా, ఎస్సెమ్మెస్‌ ద్వారా అతడు తనకు ట్రిపుల్‌ తలాఖ్‌ చెప్పినట్టు భార్య తెలిపారు. ఈ క్రమంలో కొడుకు, కూతురితో కలిసి తాను అతనితో వేరుగా ఉంటున్నానని వెల్లడించారు. పిల్లలను చూసే నెపంతో అతడు తరచూ తన ఇంటికి వచ్చేవాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. గత నెల 29న అతడు తాము ఉంటున్న ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తనను తుపాకీతో బెదిరించి.. తనపై లైంగిక దాడి జరిపాడని ఆమె పేర్కొన్నారు.

 

 

 

Similar News