కంటతడి పెట్టిన జోగు రామన్న

Update: 2019-09-11 11:13 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారి అసమ్మతి..అసంతృప్తిగళాలు బయటికొచ్చాయి. చాలా మంది నేతలు ప్రత్యక్షంగా..పరోక్షంగా తమ అసమ్మతిని వ్యక్తపరిచారు. అందులో మాజీ మంత్రి, సీనియర్ నేత జోగు రామన్న ఒకరు. తనకు విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ఆయన గట్టిగా నమ్మారు. కానీ చివరకు చోటు దక్కకపోవటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో రెండు రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన బుధవారం నాడు మీడియా ముందుకు వచ్చారు.

తాను అనారోగ్య కారణంగానే అందుబాటులో లేనని తెలిపారు. మంత్రి పదవి ఇస్తారనే ఆశ ఉండేనని, అది దక్కకపోవడంతో మనస్థాపానికి గురయ్యానన్నారు. బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరానే తప్ప అజ్ఞాతంలోకి వేళ్లే అవసరం తనకు లేదన్నారు. మచ్చలేని వ్యక్తిగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించిందంటూ మీడియా ముందు కంటతడి పెట్టారు. తనకు మంత్రి పదవి రాకున్నా టీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతానని, కేసీఆరే తమ నాయకుడు అని రామన్న అన్నారు.

Similar News