పది లక్షల సైబర్ నిపుణులకు డిమాండ్

Update: 2019-09-11 11:41 GMT

సైబర్ సెక్యూరిటీ. రాబోయే రోజుల్లో అతి పెద్ద సవాల్ గా మారనుంది. ఎప్పటికప్పుడు హ్యాకర్లు కొత్త మార్గాలు వెతుక్కుంటూ సైబర్ భద్రతకు సవాళ్ళు విసురుతూనే ఉన్నారు. వ్యక్తులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల భద్రతతోపాటు..క్రెడిట్ కార్డులు..డెబిట్ కార్డుల వివరాలను కూడా తస్కరిస్తూ హ్యాకర్లు సవాల్ విసురుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో సైబర్ సెక్యూరిటీ నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. అది ఎంతగా అంటే ఏకంగా పది లక్షల మంది నిపుణులు ఈ రంగానికి అవసరం అవుతారట. 2020 నాటికే ఈ మేరకు నిపుణులు అవసరం అవుతారని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) అంచనా వేసింది.

పరిశ్రమకు అవసరమైన రీతిలో తర్ఫీదు ఇచ్చేందుకు ఆరు నెలల ఆన్ లైన్ ప్రోగ్రామ్ అవసరం ఉందన్నారు. ఈ విభాగంలోని నిపుణులకు సగటు వేతనం ఏటా 19 లక్షల రూపాయల వరకూ ఓ అంచనా. అంటే నెలకు లక్షన్నరకు పైగా వేతనం వస్తుంది అన్న మాట. మరి ఈ ప్యాకేజీ వేతనాలను అందుకునేందుకు ఐటి రంగంలోని నిపుణులు ఈ దిశగా పయనిస్తారా? లేక భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తరహాలోనే సైబర్ సెక్యూరిటీ నిపుణుల కొరతను ఎదుర్కొంటుందా అన్నది వేచిచూడాల్సిందే.

Similar News