రామ్ చరణ్ న్యూ లుక్ ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ లుక్ గానే కన్పిస్తోంది. ముంబయ్ లో హీరోయిన్ కియారా అద్వానీ పుట్టిన రోజుకు హాజరైన చరణ్ న్యూలుక్ లో కన్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. మరో కీలక పాత్ర కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, కియారా అద్వానీలు వినయ విధేమ రామ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.