ఇక చెప్పకుండా చేస్తా..ప్రభాస్

Update: 2019-08-18 16:59 GMT

‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గతంలో తాను ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ఫ్యాన్స్ కు మాటిచ్చానని..కానీ సాహోలో ఎంత పెద్ద సన్నివేశాలు..ఛేజింగ్, యాక్షన్ సీన్స్ ఉన్నాయో ట్రైలర్ లో చూశారు కదా?. అందుకే ఆలశ్యం అయింది. అయితే ఇక నుంచి చెప్పకుండానే చేస్తా అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు ప్రభాస్. సాహో దర్శకుడు సుజీత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాస్ పల్స్ తెలిసిన డైరక్టర్ అని వ్యాఖ్యానించారు. ఫ్యాన్స్..హై హార్డ్ ఫ్యాన్స్ అన్న డైలాగ్ ఆయనే రాశారని తెలిపారు. ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ కార్యక్రమంలో ఎస్. ఎస్. రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ఏ హీరో అభిమానులైనా.. తమ హీరో సినిమా హిట్టవ్వాలని కోరుకుంటారు. కానీ హీరోలందరి అభిమానులు ప్రభాస్ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రభాస్ ఏ రోజూ.. ఎవ్వరి గురించి చెడుగా మాట్లాడడు. తన చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది.

అదే ఆయనకు అభిమానులను సంపాదించి పెట్టింది. ఆగస్ట్ 30న ‘సాహో’ వస్తుంది. ప్రభాస్‌కి దూరదృష్టి ఎక్కువ. బాహుబలి కథ చెప్పినప్పుడే ప్రభాస్ తన తదుపరి చిత్రం ఏమిటని ఆలోచించాడు. చాలా తపన పడ్డాడు. బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని చాలా చాలా తపన పడ్డాడు. ఒకరోజు సంతోషంగా వచ్చి.. సుజిత్ వచ్చి కథ చెప్పాడు డార్లింగ్. అద్భుతంగా ఉంది అని చాలా ఆనందంగా చెప్పాడు. అయితే ప్రభాస్ అలా చెప్పగానే నాకు నచ్చింది ఏమిటంటే.. ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత ఇంకా పెద్ద డైరెక్టర్‌తో సినిమా చేయాలని కాకుండా, కథను నమ్మి ‘సాహో’ చేశాడు. సుజిత్ చెప్పిన కథ నమ్మి, బాహుబలి తర్వాత ఇలాంటి సినిమా అయితే అభిమానులకు నచ్చుతుందని నమ్మి ఈ సినిమా చేశాడు. ఇది చాలా గొప్ప విషయం. సుజిత్ చాలా చిన్న కుర్రాడు. ఈ సినిమా ప్రకటించగానే ఇంత పెద్ద సినిమా చేయగలడా లేదా అని.. చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు.

నాకు తెలిసి టీజర్ కన్నా ముందు ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే అర్థం అయ్యిండాలి. టీజర్ తర్వాత కన్ఫర్మ్ అయ్యింది. ట్రైలర్ తర్వాత సుజీత్ పవరేంటో అందరికీ అర్థం అయ్యింది. సుజిత్‌కు శుభాకాంక్షలు. అంత పెద్ద పెద్ద సాంకేతిక నిపుణులని, అంత పెద్ద బడ్జెట్‌ని, ప్రభాస్ వంటి ఆల్ ఇండియా స్టార్‌ని హ్యాండిల్ చేయడం అంటే మాములు విషయం కాదు. సుజిత్ ప్రొఫెషనల్ డైరెక్టర్‌లా చేశాడు. అతని భుజాలపైనే ఈ సినిమా నిలబడింది. హృదయ పూర్వకంగా సుజిత్‌ని అభినందిస్తున్నాను. నిర్మాతలకు నిజంగానే చాలా గట్స్ ఉన్నాయి. ప్రభాస్ ఏది అడిగితే అది.. కళ్లు మూసుకుని చేసేస్తారు. ప్రభాస్ అంటే అంత నమ్మకం. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు.. సుజిత్ కథను నమ్మారు. అందుకే ఈ సినిమాపై అంత నమ్మకంగా ఉన్నాను. నేను ఖచ్చితంగా చెప్పగలను అని వ్యాఖ్యానించారు.

 

 

 

 

 

Similar News