గ్యాంగ్ లీడర్ విడుదల తేదీ వచ్చేసింది

Update: 2019-08-09 14:01 GMT

సస్పెన్స్ కు తెరపడింది. నాని గ్యాంగ్ లీడర్ విడుదల తేదీ వచ్చేసింది. సెప్టెంబర్ 13న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు నాని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సెప్టెంబర్ నెల నానికి ఎంతో కలసి వచ్చిన నెల. అందుకే ఈ నెలను ఆయన గ్యాంగ్ లీడర్ విడుదలకు ఎంపిక చేసుకున్నారు. వాస్తవానికి ఆగస్టు 30న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

కానీ ‘సాహో’ సినిమా విడుదల తేదీని ఆగస్టు 15 నుంచి 30కి మార్చటంతో నాని సినిమా వాయిదా అనివార్యం అయింది. సాహో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావటం ఒకెత్తు అయితే..థియేటర్ల అందుబాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్యాంగ్ లీడర్ చిత్ర యూనిట్ వాయిదా నిర్ణయం తీసుకుంది. జెర్సీ సినిమా తర్వాత నాని చేసిన సినిమా ఇదే.

 

Similar News