ఫార్మా రంగంలో పరిశోధనలు పెరగాలి

Update: 2019-08-18 12:53 GMT

ఫార్మా రంగంలో పరిశోధనలు, ప్రయోగాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ‘క్లినికాన్-2019’ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ సదస్సును సెంటర్ ఫర్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించాయి. వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న వారిని మంత్రి ఈటెల అభినందించారు.సామాన్యులకు సైతం ఔషధాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.

వైద్య రంగంలోన పరిశోధనలతోనే మానవాళికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందని అందుకే రంగంలో రాణించదలచిన విద్యార్దులు పరిశోధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని క్లినోసెల్ ఐటి ఎనేబుల్డ్ ఫార్మా సర్వీసెస్ సీఈవో ముజీబుద్దీన్ అన్నారు. కొత్తగా ఫార్మాసిస్టుగా వచ్చేవారు ముందుగా ఈ రంగం ప్రాధాన్యతను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

 

Similar News