కేంద్ర ఆర్ధిక మంత్రితో జగన్ భేటీ

Update: 2019-08-07 15:40 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటంతోపాటు..వివిధ ప్రాజెక్టుల కింద ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాల్సిందిగా వినతిపత్రం అందజేశారు. సీఎం జగన్ వెంట వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభలో వైసీపీ నేత మిథున్ రెడ్డిలు కూడా నిర్మలా సీతారామన్ ను కలిసిన వారిలో ఉన్నారు.

ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు వివరించి.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై ఉదారంగా స్పందించాలని కోరారు. అంతకు ముందు జగన్ కేంద్ర ఉపరితల, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయి అమరావతి-అనంతపురం రహదారి అంశంపై చర్చించారు. ఈ ప్రాజెక్టు కు భారీ ఎత్తున సాయం అందించాల్సిందిగా కోరారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ తోపాటు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడులను కూడా ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Similar News