తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ఝలక్. ఆ పార్టీకి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజీనామా చేశారు. గౌరవం లేని చోట కొనసాగటం కష్టం అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఆయన రామగుండం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో తన ఓటమికి బాల్క సుమన్ తోపాటు మరికొంత మంది నేతలు ఉన్నారని ఆయన ఆరోపించారు.
టీఆర్‌ఎస్‌లో అరాచకం పెరిగిపోయిందని ఆరోపించారు. తనపై, అనుచరులపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారని విమర్శించారు. పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్.. అడగకుండానే ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తుచేశారు. కొందరి వల్లే టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నట్లు వెల్లడించారు.స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన వ్యక్తి ఆ తర్వాత పార్టీలో చేరారు.పార్టీలో క్రమశిక్షణ లోపించిందని ఆయన ఆరోపించారు.