తానా సభల్లో పవన్ కామెడీ

Update: 2019-07-06 08:28 GMT

‘నేను చాలాసార్లు చదువులో ఫెయిల్ అవుతుండేవాడిని. చదువు చదవలేకకాదు. నేను అనుకునే చదువు ఎకడమిక్..స్కూల్స్ లో ఎకడమిక్ సిస్టమ్ లో లేక. బ్రెయిన్ డెవలప్ మెంట్ కు సంపూర్ణమైన పరిస్థితులు లేక. బట్టీ బట్టి క్లాస్ రూమ్ లకు వెళ్ళలేక. కొంచెం క్రియేటివ్ ఎడ్యుకేషన్ కావాలని నాకు నేను నేర్చుకున్నా. నాకు నేను ఇబ్బంది పడ్డాను..కిందపడ్డాను నేర్చుకున్నా. అలాగే సినిమా టెక్నికల్ స్కిల్స్ నాకు ఎవరూ నేర్పించలేదు. రైటింగ్ స్కిల్స్ కూడా కిందా మీద పడుతూ నేర్చుకున్నా.

కుషీ తర్వాత నాకు సినిమాల మీద ఆసక్తి తగ్గిపోయింది. సినిమాలు మనుషులను మార్చలేవు..ప్రభావితం చేయలేవు అని నమ్మాను. కుషీ వంద రోజుల ఫంక్షన్ తర్వాత సినిమాలపై ఆసక్తి తగ్గి సమాజాన్ని చదవటం. కుషీ తర్వాత నాకు దొరికిన సక్సెస్ గబ్బర్ సింగ్. సినిమా పరంగా చెప్పటం లేదు. నా గుణం చెబుతున్నా. ఒక సక్సెస్ కోసం కష్టపడతా. వెయిట్ చేస్తా.

 

 

Similar News