‘డియర్ కామ్రెడ్’ టీమ్ హంగామా

Update: 2019-07-20 04:08 GMT

హైదరాబాద్ లో ‘డియర్ కామ్రెడ్’ టీమ్ సందడి చేసింది. శుక్రవారం సాయంత్రం ‘మ్యూజిక్ ఫెస్టివల్ ఈవెంట్’లో హీరో విజయ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన హంగామా చేశారు. యువతలో ఉత్తేజం నింపేలా ఇద్దరూ ప్రయత్నించారు. హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ప్రతిరోజూ ఎవరి కష్టాలు వాళ్లకి ఉంటాయి. భయం వదిలేస్తే ఎవరు అడ్డుకున్నా జయము నీదేలే..’ అనే లైన్‌ మా సినిమా థీమ్‌ సాంగ్‌లో ఉంటుంది. నాకు నచ్చిన వాక్యం అది. మ్యూజిక్‌ ఫెస్టివల్‌ చేద్దాం అనే ఐడియా వచ్చినప్పుడు భయమేసింది. భయమున్నా చేశాం. ఇక్కడి వరకూ వచ్చాం. యాక్టర్‌ అవ్వాలి అనుకున్నప్పుడు భయమేసింది. మనందరికీ భయాలుంటాయి. దాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం.’ అని వ్యాఖ్యానించారు. రష్మికా మందన మాట్లాడుతూ ‘‘మన ఇంట్లో అమ్మ, అక్క, గర్ల్‌ ఫ్రెండ్‌ ఇలా అందరూ గౌరవం కోసం స్ట్రగుల్‌ అవుతున్నారు.

మీరెప్పుడైనా మీ ఇంట్లో అమ్మాయిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగారా? మా ఇంట్లో నేను హీరోయిన్‌ అవ్వాలి అన్నప్పుడు ‘నో’ అన్నారు. నువ్వెందుకు అంత కష్టపడాలి? ఇంట్లో ఉండొచ్చు కదా అన్నారు. కానీ నాకు నచ్చిన దానికోసం పోరాడాను. పోరాడి మీ అందరి ముందు నిలబడ్డాను. ఇష్టమైన దానికోసం పోరాడితే మీరూ నా పొజిషన్‌లో ఉండొచ్చు. అందరూ మీకు నచ్చినదాని కోసం పోరాడండి. నచ్చింది సాధిస్తే చాలా బావుంటుంది. రొమాన్స్, యాక్షన్‌ కోసం కాదు మేమిస్తున్న మెసేజ్‌ కోసం గర్ల్స్‌. అందరూ ఈ సినిమా తప్పకుండా చూడాలి. నా మాట కచ్చితంగా వినండి. ఈ సినిమా చూడండి. ఎందుకంటే ఇదో అద్భుతమైన సినిమా. నా మాట నిజంగా వింటారని ఆశిస్తున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాలోని పాటలన్నింటికీ చిత్రబృందంతో కలసి స్టేజ్‌ మీద ప్రదర్శించారు.

 

 

Similar News