తమన్నా. మిల్కీబ్యూటీ. అందమైన ఈ భామకు మరింత అందమైన డ్రెస్ వేస్తే. ఇక తెలుగు సినీ ప్రేక్షకులకు పండగే. ఆమె ఇప్పుడు అదే పనిలో ఉంది. తమన్నా ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా..భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా నరసింహరెడ్డి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమెది కీలక పాత్రగా చెబుతున్నారు. సైరా మూవీలో తమన్నా కోసం డిజైన్ చేసిన డ్రెస్ లో అత్యంత ఖరీదైనవిగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఈ డ్రెస్ డిజైన్ చేసింది ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న చిరంజీవి కుమార్తె కావటం విశేషం. ఈ సినిమాలో తమన్నా ‘లక్ష్మీ’ పాత్రలో అలరించనున్నారు.
‘నా జీవితంలో నేను ధరించిన అత్యంత ఖరీదైన దుస్తులివే’ అంటూ తమన్నా ఈ సినిమా కాస్టూమ్స్ గురించి చెబుతున్నారు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా.. చిరంజీవి ప్రధాన పాత్రలో సైరా నరసింహారెడ్డి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను... రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.