ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కొంత మందికి కాలం కలసొచ్చి ఆ కోరికలు అలా తీరిపోతాయి. మరి కొంత మంది కోరికలను తీర్చుకునేందుకు నానా కష్టాలు పడాల్సి ఉంటుంది. ఎంత కష్ట పడ్డా కూడా కొన్నిసార్లు ఫలితం కన్పించకపోవచ్చు కూడా. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓ ‘తీరని కోరిక’ ఉందట. టాలీవుడ్ తోపాటు తమిళంలోనూ గత దశాబ్దానికి పైగా ఎన్నో సినిమాలు చేసిన తమన్నా తన కోరిక తీరే టైమ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ విషయాన్ని ఆ భామే చెప్పింది. అదేంటో మీరూ చదవండి. చిన్నతనం నుంచి నుంచి నటి మాధురీదీక్షిత్ డాన్స్ చూసి ఆమెలా డ్యాన్స్ చేయాలని ఆశ పడ్డానని చెబుతోంది ఈ బ్యూటీ.
మాధురి దీక్షిత్ కు చాలా మంది అభిమానులుండేవారని, అలా తనకూ ఉండాలని కోరుకునేదాన్నని తెలిపారు. ఆ కోరికే తనను సినిమా రంగంలోకి తీసుకొచ్చిందని పేర్కొంది. దీంతో పట్టుదలతో డాన్స్ ను నేర్చుకున్నానని చెప్పారు. ఇప్పుడు కూడా డాన్స్ కు ప్రాధాన్యత కలిగిన చిత్రంలో నటించాలన్న కోరిక ఉందని, అలాంటి చిత్రంలో తన పూర్తి డాన్స్ ప్రతిభను నిరూపించుకోవాలని ఆశ పడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఆ కోరిక నెరవేరలేదు. చిన్న వయసులోనే సినిమాలోకి వచ్చానని, ఆ రోజులను తలచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుందని చెప్పారు. మరి ఇప్పటికైనా తమన్నా కోరిక నెరవేరాలని ఆశిద్దాం.