బాహుబలి1, 2 వంటి భారీ చిత్రాల్లో తానేంటో నిరూపించుకున్న దగ్గుబాటి రానా మరో చారిత్రక సినిమాలో నటించేందకు రెడీ అయ్యారు. ఈ సారి ‘హిరణ్యకశ్యప’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన శనివారం నాడు వెలువడింది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సొంత నిర్మాణ సంస్థలో ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. దాదాపు 60 ఏళ్ల తరువాత భక్త ప్రహ్లాద, హిరణ్యకశ్యపుల కథను వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నాడు.
తాజాగాచిత్ర దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారాన్ని తన ట్విట్టర్‌పేజ్‌లో పోస్ట్ చేశారు. గత మూడేళ్లుగా హిరణ్యకశ్యప సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా తెలిపారు. ఈ సినిమాలో రానా టైటిల్ రోల్‌లో నటించనున్నారని తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.