అరుంధతి2 హీరోయిన్ పాయల్

Update: 2019-06-21 15:49 GMT

అరుంధతి సినిమా టాలీవుడ్ లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతోనే అనుష్క కెరీర్ కూడా పీక్ కు చేరింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొత్త రికార్డులు నమోదు చేసుకుంది. ఇప్పుడు అరుంధతి సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఈ సినిమాలో ఆర్ ఎక్స్ 100తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేశారు. మరి అనుష్క లాగా ఆమెకు కూడా ఈ సినిమా అంత పేరు తెచ్చిపెడుతుందా?. వేచిచూడాల్సిందే. పాయల్ కు ప్రస్తుతం టాలీవుడ్ లో వరస పెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

ఇఫ్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కూడా దక్కించుకుంది. శంఖు చక్ర ఫిల్మ్స్ బ్యానర్ పై అరుంధతి 2 సినిమాను కోటి తూముల నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఆయన చెబుతున్నారు. పాన్ ఇండియా సినిమాగా అరుంధతి 2 ను నిర్మించనున్నారు. అందుకే ఈ సినిమాలో పాయల్ తోపాటు బాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు ఉండబోతున్నారని సమాచారం. త్వరలోనే చిత్ర యూనిట్ మిగిలిన విషయాలను వెల్లడించనుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం పాయల్ గుర్రపుస్వారీ, కత్తియుద్ధాలు నేర్చుకుంటోంది.

 

Similar News