టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు బంజారాహిల్స్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆయన్ను పోలీసులు ఫోర్జరీ, డేటా చోరీకి సంబంధించిన అంశాలపై గత రెండు రోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే తమకు రవిప్రకాష్ ఏ మాత్రం సహకరించటంలేదని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టీవీ9 లోగో విక్రయానికి సంబంధించిన అంశంపై 41 సీఆర్ పీసీ కింద నోటీసులు జారీ చేశారు. శుక్రవారం నాడు ఈ అంశంపై విచారణకు హాజరు కావాలని కోరారు.
టీవీ9 లోగోలను అతి తక్కువ ధరకు మోజోటీవీకి బదలాయించారనే ఆరోపణలు రవిప్రకాష్ ఎదుర్కొంటున్నారు. దాదాపు నెల పాటు అజ్ణాతంలో గడిపిన రవిప్రకాష్ సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ నిరాకరించటంతో పోలీసుల ముందు హాజరైన విషయం తెలిసిందే. పోలీసుల విచారణ ముందు..తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.