నారా లోకేష్ భద్రత కుదింపు

Update: 2019-06-25 05:40 GMT

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రతను ఏపీ ప్రభుత్వం కుదించింది. ఇప్పటివరకూ ఆయనకు 5 ప్లస్ 5 భద్రత ఉండగా..ఇప్పుడు దాన్ని 2 ప్లస్ 2కి తగ్గించారు. లోకేష్ కు భద్రత తగ్గించిన అధికారులు చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రతను పూర్తిగా తొలగించారు. కనీస సమాచారం లేకుండా ఇలా భద్రత తగ్గించటం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

జగన్ సర్కారు చంద్రబాబు కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన చంద్రబాబు ఫ్యామిలీకి సర్కారు నిర్ణయం తెలిసింది. ప్రతిపక్షంలో ఉండగా తాము జగన్మోహన్ రెడ్డికి తగినంత భద్రత కల్పించామని..పాదయాత్రలో కూడా జగన్ తమ ప్రభుత్వం సరైన భధ్రత కల్పించిందని చెబుతున్నారు. అయితే సెక్యూరిటీ సమీక్షా కమిటీ సూచనల మేరకే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

 

 

 

Similar News