ఉద్యోగులపై జగన్ వరాల జల్లు

Update: 2019-06-08 06:38 GMT

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శనివారం నాడు తొలిసారి సచివాలయంలోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. వైసీపీ గెలుపులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా కీలక పాత్ర పోషించారు. దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దుతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి పలు చర్యలు చేపడతామని ఎన్నికల సమయంలో జగన్ హామీలు ఇచ్చారు. జగన్ తన హామీల మేరకు ఆదివారం నాడు జరిగే తొలి కేబినెట్ లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు.

తొలిసారి సచివాలయానికి వచ్చిన ఆయన శనివారం ఉదయం గ్రీవెన్స్‌ హాల్‌లో ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ప్రకటించారు. సీపీఎస్‌ రద్దుపై ఆదివారం జరిగే మంత్రవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంచుతామని ప్రకటన చేశారు. 27 శాతం మధ్యంతర భృతి ఇస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News