‘దొరసాని’ టీజర్ విడుదల

Update: 2019-06-06 04:58 GMT

దొరసాని.. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకు కారణం ఇందులో నటిస్తున్న నటులే. హీరోయిన్ శివాత్మిక సీనియర్ హీరో రాజశేఖర్, జీవితల కుమార్తె. హీరో ఆనంద్ ప్రస్తుత టాలీవుడ్ యూత్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా టీజర్ గురువారం నాడు విడుదలైంది. తెలంగాణలోని ఒకప్పటి గడీల కాలంలో జరిగే కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ ఆకట్టుకుంటోంది.

టీజర్ లో హీరో..హీరోయిన్ల మధ్య సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. శివాత్మిక కూడా అమాయకత్వంతో కూడిన పల్లె పడుచుగా కనపడింది. ఆనంద్‌ డైలాగ్‌ డెలివరీలో కూడా విజయ్‌ మాడ్యులేషన్‌ కనబడటం ఆసక్తికరంగా ఉంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్‌ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ద్వారా కేవీఆర్‌ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

https://www.youtube.com/watch?v=pg5BXslJ6o0

 

Similar News