అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నారు. ఈ హీరో ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరోసారి అల్లు అర్జున్ తో పూజా హెగ్డె జోడీ కడుతోంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రారంభించాడు. గతంలో వీరి కాంబినేషనలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాలో నవదీప్, రాహుల్ రామకృష్ణలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ బన్నీ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆన్ లోకేషన్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. లాంగ్ హెయిర్‌తో ఫార్మల్ డ్రస్‌లో కనిపిస్తున్న స్టైలిష్ స్టార్ లుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.