చిన్న సినిమా పెద్ద హిట్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ వసూళ్ళ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా పది కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ళు సాధించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. హీరో నవీన్ పొలిశెట్టి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఆయన్ను హీరోగా పరిచయం చేస్తూ స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఏజెంట్ సాయి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లో పది కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఈసందర్భంగా చిత్రయూనిట్ ఫిక్షనల్ కాదు ఒరిజినల్ బ్లాక్ బస్టర్ అంటూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.