విద్యార్ధుల జీవితాలతో తెలంగాణ ఇంటర్ బోర్డు ఆటలు

Update: 2019-05-28 04:42 GMT

తెలంగాణ ఇంటర్ బోర్డు అడ్డగోలు నిర్లక్ష్యం బట్టబయలైంది. బోర్డు నిర్లక్ష్యం కారణంగా ఫలితాల్లో పెద్ద ఎత్తున పొరపాట్లు చోటుచేసుకున్నాయి. ఓ అర్హత లేని కంపెనీకి ఇంటర్ బోర్డు ఫలితాల బాధ్యతలు అప్పగించి తీవ్ర విమర్శల పాలు అయింది బోర్డు. ఈ విమర్శల నేపథ్యంలో మళ్లీ విద్యార్ధుల అందరి పేపర్లు ఓ సారి చూడాలని..మార్కులను కూడా పరిశీలించాలని హైకోర్టు కూడా ఆదేశించింది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బోర్డు తొలుత ఫలితాలు ప్రకటించినప్పుడు తప్పిన వారు...పున:లెక్కింపులో 1137 మంది పాస్ అయ్యారు. అంటే వేలాది మంది జీవితాలతో బోర్డు ఆడుకున్నట్లు తేలియిపోయింది. తప్పులు ఇంత నిస్సిగ్గుగా తేలినా కూడా చనిపోయిన వారు ఎవరూ పాస్ కాలేదని చెప్పుకుంటూ తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రకటనలు చేస్తోంది. ఓకే. చనిపోయిన వారు ఎవరూ పాస్ కాకపోయి ఉండొచ్చు.

మరి బతికున్న విద్యార్ధులను తప్పినట్లు చూపించి వారి భవిష్యత్ ను చంపేశారు కదా?. దీనికి బాధ్యులెవరు?. ఇదొక్కటే కాదు..చాలా మంది విద్యార్ధులకు ఈ పరిశీలనలో మార్కులు కూడా పెరిగాయి. గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థ చేసిన సాంకేతిక తప్పిదాలే కాకుండా..జవాబు పత్రాల మూల్యాంకనంలో ఎన్నో పొరపాట్లు దొర్లాయనే విషయం తేటతెల్లం అయింది. మార్కులు పెరగటంతో కొత్తగా పాసైన వారి జాబితాను బోర్డు సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అప్ లోడ్ చేసింది. పునర్ పరిశీలన తర్వాత పాసైన వారిలో సెకండర్ ఇయర్ విద్యార్ధులు 585 మంది ఉంటే..ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు 552 మంది ఉన్నారు. పునర్ పరిశీలనలో ఆరు అంత కంటే ఎక్కువ మార్కులు పెరిగిన వారి సంఖ్య 497గా ఉంది. అయితే అనధికారిక సమాచారం ప్రకారం రీ వెరిఫికేషన్ లో మాత్రం చనిపోయిన విద్యార్ధుల్లో ముగ్గురు పాస్ అయినట్లు తెలుస్తోంది.

 

 

Similar News