దగ్గుబాటి రానా. తెలుగులో విలక్షణ నటుడు. విభిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఇప్పుడు రానా ఉన్న కొత్త లుక్ చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. అలా ఉంది మరి ఆ లుక్. భారీ గడ్డం...మాసిపోయినట్లు ఉన్న ఓ టీ షర్ట్..చేతిలో రెండు ఫోన్లు పట్టుకుని కారు దగ్గర ఉన్న లుక్ చూసి రానా అభిమానులు కూడా షాక్ కు గురవుతున్నారు. ప్రస్తుతం రానా బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న హాథీమేరి సాథీ సినిమాలో నటిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా రానా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో చంద్రబాబు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత ఈ హీరో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న విరాటపర్వం సినిమాలో నటించనున్నాడు. దీంతోపాటు గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో హిరణ్యకశ్యప అనే పౌరాణిక చిత్రాన్ని స్వయంగా నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. బాహుబలి సినిమా తర్వాత నుంచి ప్రభాస్ తో పాటు రానా క్రేజ్ కూడా ఓ రేంజ్ లో పెరిగిపోయింది.