పోలవరం పనులు 70 శాతం పూర్తి

Update: 2019-05-06 07:14 GMT

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్లే సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తొలుత ఏరియల్ సర్వే చేశారు. తర్వాత ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను కూడా తనిఖీ చేశారు. గత పర్యటనలతో పోలిస్తే ఈ సారి పర్యటన చప్పగా సాగిందనే చెప్పొచ్చు. ప్రతిసారి సీఎం పర్యటన సమయంలో హాజరయ్యే ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ డుమ్మా కొట్టారు. అయితే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల సెలవులో ఉన్నట్లు సమాచారం. అయితే అనవసర వివాదంలో ఇరుక్కోవటం ఇష్టం లేకే ఆయన దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రాజెక్టు సైట్ లో పనులు పర్యవేక్షించే ఇంజనీర్లు..సలహాదారులు, మంత్రి ఉమా మాత్రమే చంద్రబాబుతోపాటు పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షణకు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే..కరవును జయించినట్లు అవుతుందన్నారు.

సముద్రంలోకి వృధాగా నీళ్ళు పోతున్నాయి. రాష్ట్రం మాత్రం కరువుతో బాధపడుతోంది. పోలవరం చిరకాల కోరిక..చిరకాల వాంఛ. 2015లో ముమ్మరంగా పనులు ప్రారంభించాం. 70.17 శాతం పనులు పూర్తి చేశాం. ఇఫ్పటికీ ఇది జరగాలంటే 90 వర్చువల్ ఇన్ స్పెక్షన్లు..30 సార్లు సైట్ తనిఖీలు చేశాను. వదిలి పెడితే కొలాప్స్ అవుతుంది. అందుకే ఫోకస్ పెడుతున్నాం. కేంద్రం సరిగా పట్టించుకోకపోవటం వల్ల విపరీత జాప్యం జరుగుతోంది. కాఫర్ డ్యాం జూన్ 15 కి సేఫ్ లెవల్ కు వెళుతుంది. తదుపరి నెలకు పూర్తి స్థాయిలో రెడీ అవుతుందని చంద్రబాబు తెలిపారు.

 

Similar News