‘దాల్ లేక్’లో 16 కొత్త వ్యూ పాయింట్స్

Update: 2019-05-10 11:14 GMT

దాల్ లేక్. పర్యాటకులకు అది ఓ అద్భుతమైన ప్రాంతం. జమ్మూ కాశ్మీర్ సందర్శనకు వెళ్ళిన వారు ఎవరైనా ఈ ప్రాంతాన్ని చూడకుండా వెనక్కి రారు. అంతటి ప్రాముఖ్యత ఉంటుంది ఈ ప్రాంతానికి. పర్యాటకుల సౌకర్యార్ధం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కొత్తగా దాల్ లేక్ లో 16 వ్యూ ఫాయింట్స్ ఏర్పాటు చేయనుంది. పర్యాటకుల సౌకర్యార్ధం...మరిన్ని మెరుగైన సౌకర్యాలతో ఈ పాయింట్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటిని ఘాట్స్ గా సర్కారు చెబుతోంది.

అత్యాధునిక, సంప్రదాయ పద్దతులతో ఈ వ్యూ పాయింట్స్ ను డెవలప్ చేయనున్నారు. ఈ విషయాన్ని కాశ్మీర్ టూరిజం డైరక్టర్ ఎన్ ఏ వాణి తెలిపారు. ఈ వ్యూ పాయింట్స్ రాబోయే రోజుల్లో పర్యాటకులను మరింత ఆకట్టుకోవటానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. దాల్ లేక్ లో భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలు భాషలు చిత్రాలు అక్కడ షూటింగ్ చేసుకునే విషయం తెలిసిందే.

Similar News