ఏపీ టెన్త్ ఫలితాల్లో తూర్పు ఫస్ట్..నెల్లూరు లాస్ట్

Update: 2019-05-14 05:59 GMT

ఆంధ్రప్రదేశ్ కు చెందిన పదవి తరగతి పలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలను పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలవగా..నెల్లూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ మూడో తేదీ వరకు 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634మంది విద్యార్థులు పదోతరగతి చదవగా వీరిలో 99.5 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 94.88 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు (95.09) శాతంతో బాలుర(94.68)పై పైచేయి సాధించారు.

రాష్ట్రమంతటా కలుపుకుని 11,690 స్కూళ్ళకు చెందిన విద్యార్ధులు పరీక్షలకు హాజరు కాగా..అందులో 5464 పాఠశాలలకు సంబంధించి వంద శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. కేవలం మూడు పాఠశాలల్లో జీరో ఫలితాలు నమోదు అయ్యాయి. రెండు రోజుల్లో వెబ్ సైట్ మార్కుల మెమో పెడతామని తెలిపారు. జూన్ 7ను సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేదీగా నిర్ణయించారు.

Similar News