‘ఏబీసీడీ’ ట్రైలర్ విడుదల

Update: 2019-04-15 05:24 GMT

అల్లు శిరీష్. వెండి తెరపై అలా మెరిసి ఇలా మాయం అయిపోతారు. ఎందుకో ఆయనకు సినిమాలు కలసి వస్తున్నట్లు లేదు. చేసిన సినిమాలు అన్నీ కూడా ఓ మోస్తరుగా ఆడటం తప్ప..హిట్ అంటూ ఒక్కటీ లేదు. ఇప్పుడు ఈ కుర్రహీరో ‘ఏబీసీడీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏబీసీడీ అంటే అమెరికన్ బార్న్ కన్ ప్యూజ్డ్ దేశీ అన్నది సినిమా ఉప శీర్షిక.

ఈ సినిమాలో శిరీష్ కు జోడీగా రుక్సార్ థిల్లన్ హీరోయిన్ గా నటించింది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా..అది జరగలేదు. తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

https://www.youtube.com/watch?v=Ar1r4Nf-0sg

Similar News