పెళ్ళి తర్వాత సమంత, నాగచైతన్య జంటగా నటించిన తొలి సినిమా ‘మజిలీ’. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెంచింది. అందులో భాగంగా సోమవారం నాడు సినిమాకు సంబంధించి రెండవ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది. ‘ఇష్టమైన సఖుడా..ఇష్టమైన సఖుడా..ఒక్కసారి చూడరా’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చైతన్య ప్రసాద్ రచించిన ఈ పాటను గాయని చిన్మయి శ్రీపాద చాలా ఆలపించారు. ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి గోపీసుందర్ స్వరాలను సమకూర్చారు.
https://www.youtube.com/watch?time_continue=61&v=7TgSCEQYUpI