ఎన్టీఆర్ గుజరాత్ లోని వడోదరకు బయలుదేరారు. ఎందుకు అంటారా?. ఆర్ఆర్ఆర్ మూవీ తదుపరి షెడ్యూల్ అక్కడే జరుగుతోంది. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చెబుతూ తాను విమాన టిక్కెట్ ను షేర్ చేశారు. ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఎన్టీఆర్ తోపాటు రామ్ చరణ్, భారీ తారాగణం నటిస్తోంది. ఇటీవలే దర్శకుడు రాజమౌళి విలేకరుల సమావేశం పెట్టి సినిమా విశేషాలను వెల్లడించారు.
రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా..ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 350 నుంచి 400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా విదేశీ భామ డైసీ అడ్గార్ జోన్స్, చరణ్ కు జోడీగా ఆలియాభట్ నటించనున్నారు.