రకుల్ కు ‘షాకిచ్చిన హోటల్’

Update: 2019-02-16 04:39 GMT

రకుల్ ప్రీత్ సింగ్. ఓ వైపు వరస పెట్టి సినిమాలు చేస్తూనే..మరో వైపు రకరకాల వ్యాపారాల్లోనూ సంపాదించేస్తుంది. హైదరాబాద్ లో ఫ్రాంఛైజ్ తీసుకుని మరీ కాస్ట్లీ జిమ్ లు ఏర్పాటు చేసి సొమ్ములు చేసుకుంటోంది. అలాంటి రకుల్ కు ఫ్రెండ్స్ కు పార్టీ ఇవ్వటం పెద్ద కష్టమా?. ఆమె కూడా అంతే అనుకుని తన ఫ్రెండ్స్ ఓ పది మందికి పార్టీ ఇఛ్చేసింది. అప్పటివరకూ అందరూ హాయిగా ఎంజాయ్ చేశారు. కానీ బిల్లు చేతికి వచ్చాక మాత్రం చుక్కలు కన్పించాయట ఈ అమ్మడికి. ఎందుకంటే పది మంది పార్టీకి బిల్లు ఎంతో తెలుసా?. అక్షరాలా పది లక్షలు. ఈ మొత్తం చూసిన ఆమె అవాక్కు అవ్వటం తప్ప చేసేది ఏముంటది.

కామ్ గా పది లక్షలు కట్టేసి..మళ్లీ చస్తే మీ హోటల్ కు రాం పోండి అంటూ శాపనార్ధాలు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. అంటే ఒక్క పూట పార్టీకి ఒక్కో వ్యక్తిపై ఆ హోటల్ లక్ష రూపాయలు ఛార్జ్ చేసింది. అయితే అది భారత్ లో కాదు..లండన్ లోని హోటల్ లేండి. ఫ్రెండ్స్ తో సరదాగా ఎంజాయ్ చేద్దామని ట్రప్ కు వెళ్లిన ఈ భామకు హోటల్ బిల్లు మాత్రం పార్టీని ఎంజాయ్ చేసిన ఫీల్ లేకుండా చేసేసింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది ఈ భామ.

Similar News