ప్రముఖ టీలీవుడ్ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. లక్షల రూపాయల నగదు, ఆభరణాలు చోరికి గురైనట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నగదు ఎంత మొత్తం అనే విషయం బహిర్గతం కానివ్వటం లేదు. చోరీ పనిమనిషి పనే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోహన్ బాబు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనూ ఇదే విధంగా చోరి జరిగింది. చిరు ఇంట్లో చాలా కాలంగా నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తే 2 లక్షల రూపాయిల చోరి చేశాడు. మోహన్ బాబు ఇంట్లో దొంగతనాకి సంబంధించి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది.